అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది.

మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి.

ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించా లని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది.

మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రెడీ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *